దునియా

IndiGo Fare Hike: ఇండిగో బాదుడు.. ఫ్లైట్ జర్నీ మరింత కాస్ట్లీ!

IndiGo Fare Hike: ఇండిగో ప్రయాణికులకు గట్టి ఝలక్ ఇచ్చింది. చిన్న పిల్లల టికెట్ ఛార్జీలతో పాటు ఎక్స్‌ట్రా లగేజీ, ఇతర సేవల ధరలను భారీగా పెంచుతూ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టికెట్ ధరలు మండిపోతుండగా, ఈ తాజా పెంపు విమాన ప్రయాణికులపై మరింత భారాన్ని మోపనుంది. పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయి.రెండేళ్ల లోపు పసిపిల్లలకు ఇప్పటి వరకు రూ.2,000 వసూలు చేయగా, ఇప్పుడు దాన్ని ఏకంగా రూ.3,000కి పెంచారు. తల్లిదండ్రులతో కలిసి ప్రయాణించే ఈ చిన్నారులకు ప్రత్యేకంగా సీటు కేటాయించకపోయినా ఇకపై ఈ రేటు కట్టాల్సిందే.