క్రీడలు

పాక్‌పై భారత్ సూపర్ విక్టరీ.. చిరకాల ప్రత్యర్థిపై ఏకపక్ష విజయం!

 మహిళల ఆసియా కప్ 2026టోర్నీలో భారత మహిళల జట్టు తన అజేయ ప్రయాణాన్ని కొనసాగిస్తూ, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు భారత స్పిన్నర్లు చుక్కలు చూపించారు. దాంతో పాక్ జట్టు కేవలం 55 పరుగులకే కుప్పకూలింది. మహిళల టీ20 క్రికెట్ చరిత్రలోనే పాకిస్థాన్‌కు ఇది అత్యల్ప స్కోరు కావడం గమనార్హం.