వ్యాపారం
మెరుగ్గా భారత్ జీడీపీ వృద్ధిరేటు.. IMF నివేదిక విడుదల
ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు ఒడిదుడులకు గురవుతూనే ఉన్నాయి.మిడిల్ ఈస్ట్‌లో యుద్ధాల కారణంగా చమురుకు భారీ డిమాండ్ ఏర్పడింది.మడి చమురు కొరత కారణంగా చాలా దేశాల్లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఆయా దేశాల ఆర్థిక పరిస్థితులు నేల చూపులు చూస్తున్నాయి. ప్రపంచమొత్తం మాంద్యం ఉచ్చులో ఇరుక్కోనుందా? అనే భయాలు వెంటాడుతున్నాయి. ఇన్వెస్టర్ల భయం కూడా ఆర్థికవ్యవస్థలు కుప్పకూలడానికి దోహదం చేస్తున్నాయి. ఇలాంటి విపత్కర, ఆర్థికపరంగా క్లిష్టమైన పరిస్థితులు నెలకొనడంతో తాజాగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) భారత్‌కు శుభవార్త చెప్పింది. పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నా భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన వేగంతో ముందుకు సాగుతోందని తెలిపింది.
