వ్యాపారం

చిన్న చిప్‌.. పెద్ద గేమ్! చైనా ఆధిపత్యానికి భార‌త్ చెక్!

ఈరోజు మన చేతిలో కనిపించేది కొన్ని మిల్లీమీటర్ల పరిమాణంలో ఉన్న ఒక చిన్న చిప్‌ మాత్రమే కావచ్చు. కానీ ఆ చిన్న చిప్‌ వెనుక జరుగుతున్న పోటీ మాత్రం.. రేపటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ స్థాయిని నిర్ణయించేంత పెద్దది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకొస్తున్న సెమీకండక్టర్‌ మిషన్‌ 2.0 కూడా కీలకంగా మారుతోంది.