అభిప్రాయం

Indian politics: ఇండియన్ పాలిటిక్స్ ఏం నేర్పుతున్నాయి?

భారత రాజకీయ చరిత్రలో స్వాతంత్ర్యం కోసం పోరాడిన నాయకుల త్యాగాల నుంచి నేటి అధికార పోరాటాల వరకు ఎన్నో మార్పులు కనిపిస్తాయి. ఒకప్పుడు ప్రజాసేవే పరమావధిగా రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు కనిపిస్తారు.. కానీ నేడు అధికారం, ఆర్థిక బలం, ఎన్నికల వ్యూహాలు, ప్రచార ఆర్భాటం రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. అలాగే ఓటు బ్యాంక్ రాజకీయాలు పురుడు పోసుకున్నాయి. కులం, మతం, ప్రాంతం, భాష ఆధారంగా ఓట్లను చీల్చే కుతంత్రాలు మొదలయ్యాయి. భావజాలమే ఆధారంగా ఒకప్పుడు సాగిన రాజకీయాలు, క్రమంగా వ్యాపారంగా రూపాంతరం చెందాయి. సిద్ధాంతాల కంటే గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత పెరిగింది. అదేవిధంగా నేడు రాజకీయాలు డిజిటలైజ్ అయ్యాయి... సోషల్ మీడియా ప్రచారాలు, కోట్లాది రూపాయల ప్రకటనలు, ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లా మారాయి.