International
US: ట్రంప్‌నకు ‘ఇండియన్ అమెరికన్ల’ బిగ్ షాక్.. డెమోక్రాట్ల వైపే ఏకపక్ష మొగ్గు!
US: అమెరికా మధ్యంతర ఎన్నికల వేళ రిపబ్లికన్ పార్టీ అధినేత డొనాల్డ్ ట్రంప్‌నకు భారత సంతతి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. యూఎస్ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన ఇండియన్ అమెరికన్లు ఈసారి స్పష్టంగా డెమోక్రాట్ల వైపే నిలబడినట్లు తాజా లెక్కలు తేల్చాయి. ఎన్నికల వేళ యూగవ్‌తో కలిసి ప్రతిష్టాత్మక కార్నెగీ సంస్థ నిర్వహించిన ‘ఇండియన్ అమెరికన్ యాటిట్యూడ్స్ సర్వే’లో వెల్లడైన సంచలన విషయాలు ట్రంప్ శిబిరానికి మింగుడుపడటం లేదు.సర్వే వివరాల ప్రకారం.. భారతీయ అమెరికన్లలో ఏకంగా 62 శాతం మంది తమ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌లలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులకే పట్టం కట్టేందుకు మొగ్గు చూపారు. ట్రంప్‌నకు, రిపబ్లికన్లకు మద్దతుగా నిలిచింది కేవలం 19 శాతం మంది మాత్రమే.
