India vs Pakistan Football: పాక్‌పై భారత్ సంచలన విజయం..
India vs Pakistan Football: దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య ఛాంపియన్‌షిప్‌లో భారత్ అదిరిపోయే బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడిన టీమిండియా 3-2 గోల్స్ తేడాతో దుమ్మురేపే విజయాన్ని అందుకుంది. మ్యాచ్ ఆఖరి క్షణాల్లో పాక్ అనూహ్యంగా రెండు గోల్స్ చేసి తీవ్ర ఒత్తిడి పెంచినా.. పట్టువదలని మన ఆటగాళ్లు ఆధిక్యాన్ని కాపాడుకుని విజేతగా నిలిచారు.మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే భారత ఫార్వర్డ్ సుహైల్ అహ్మద్ భట్ పాక్ డిఫెన్స్‌ను చీల్చుతూ వరుస దాడులు చేశాడు. ఆట 13వ నిమిషంలోనే మెరుపు గోల్ కొట్టి పాక్‌కు గట్టి షాకిచ్చాడు. ఆ జోరులోనే 19వ నిమిషంలో సుహైల్ మరో గోల్ సాధించి భారత్‌కు 2-0 లీడ్ అందించాడు. అనంతరం 32వ నిమిషంలో మాంగ్లెంతాంగ్ కిప్గెన్ మరో సూపర్ గోల్‌తో స్కోరును 3-0కి పెంచడంతో మ్యాచ్ పూర్తిగా టీమిండియా కంట్రోల్లోకి వచ్చేసింది. ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి భారత్ తిరుగులేని స్థితిలో నిలిచింది.
