National
Trade Deal: భారత్ - అమెరికా తొలి దశ ట్రేడ్ డీల్ పూర్తయినట్లే: పీయూష్ గోయల్
Trade Deal: భారత్, అమెరికాల మధ్య ఎప్పటినుంచో నడుస్తున్న మెగా బిజినెస్ డీల్‌పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఇరు దేశాల మధ్య కుదరాల్సిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో మొదటి రౌండ్ చర్చలు పూర్తయ్యాయని, తొలి దశ ప్రాసెస్ దాదాపు కొలిక్కి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన ఓ ఈవెంట్లో మాట్లాడిన గోయల్.. ఈ డీల్‌కు సంబంధించి ప్రస్తుతం లీగల్ డ్రాఫ్ట్ రెడీ అవుతోందని చెప్పారు..
