అంబులెన్స్‌కు కొత్త రూల్స్ విధించిన ఎన్‌హెచ్‌ఏఐ!..
భారత జాతీయ రహదారుల సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ హైవే లపై జరిగే రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు త్వరితగతిన అత్యవసర వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసిన అంబులెన్స్‌ల విషయంలో నియమాలను కఠినతరం చేసింది. ప్రమాద వార్త తెలిసిన 10 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకోవాలని గడువు విధించింది. ప్రమాద స్థలం అంబులెన్స్ పరిధిలోని 10 కిలోమీటర్లలో ఉంటే, తాజా నిబంధనల ప్రకారం 10 నిమిషాల్లోపు అంబులెన్స్ అక్కడికి చేరుకోవాలి. 10 కిలోమీటర్లకు మించి దూరం ఉంటే, అందుకు అనుగుణంగా అదనపు సమయం కేటాయిస్తారు.
అంబులెన్స్ చేరుకున్న సమయం, ప్రయాణ వివరాలను GPS డేటా, NHAI Care Dashboard ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తారు. ప్రమాదానికి సంబంధించిన కాల్ అందిన సమయం నుంచి గంటలోపు బాధితులను సమీప ఆసుపత్రికి తరలించాలి. ఈ విషయంలో ఆలస్యం జరిగితే రూ.10 వేల జరిమానా విధిస్తారు. అదేవిధంగా అత్యవసర కాల్‌ను అంబులెన్స్ సిబ్బంది తిరస్కరించినా, అంబులెన్స్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన వైద్య పరికరాలు, మందులు లేదా సిబ్బంది అందుబాటులో లేకపోయినా రూ.10 వేల పెనాల్టీ విధించేలా నిబంధనలు రూపొందించారు.
