National

India - Russia: డాలర్ పెత్తనానికి భారత్ - రష్యా ఉమ్మడి చెక్.. ఢిల్లీ- మాస్కో సరికొత్త గేమ్‌ప్లాన్ ఇదేనా!

ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత యావత్ ప్రపంచాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు అమెరికా, పాశ్చాత్య కూటమి విసిరిన అత్యంత బలమైన అస్త్రం ‘ఆర్థిక ఆంక్షలు’. రష్యాతో ఎవరు వాణిజ్యం సాగించినా తీవ్ర పరిణామాలుంటాయంటూ వాషింగ్టన్ జారీ చేసిన హెచ్చరికల ముందు చాలా దేశాలు మోకరిల్లాయి. కానీ, 140 కోట్ల జనాభా ప్రయోజనాలే పరమావధిగా నిలిచిన భారత్ మాత్రం ఆ ఒత్తిళ్లకు ఏమాత్రం తలొగ్గలేదు. "మా జాతీయ ఇంధన భద్రతే మాకు ప్రథమ ప్రాధాన్యం" అని కుండబద్దలు కొట్టిన ఢిల్లీ దౌత్యనీతి.. ఇప్పుడు రష్యాతో బంధాన్ని సరికొత్త వ్యూహాత్మక శిఖరాలకు చేర్చింది. ఇది కేవలం చౌకగా ముడిచమురు కొనడానికే పరిమితమైన బంధం కాదు.. అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థలో డాలర్ గుత్తాధిపత్యాన్ని బద్దలు కొడుతూ, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో రికార్డులు సృష్టిస్తున్న సరికొత్త భౌగోళిక రాజకీయ విప్లవం.