National
యూపీఐ చార్జీలపై పొలిటికల్ వార్.. రాహుల్ గాంధీ వైఖరిపై బీజేపీ విమర్శలు!!..
యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ చార్జీల విధించే ప్రతిపాదనపై రాజకీయాలు వేడెక్కాయి! కేంద్ర ప్రభుత్వంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడుతుంటే, బీజేపీ మాత్రం ఆయనపై ఎదురుదాడికి దిగింది. ఎండీఆర్ విధానాన్ని సమర్థిస్తూ పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన నివేదికకు పి. చిదంబరం, మనీష్ తివారీ సహా ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలు సంతకాలు చేశారని బీజేపీ గుర్తుచేసింది. కమిటీలో సొంత ఎంపీలు మద్దతు తెలిపిన అంశాన్ని బయట రాహుల్ గాంధీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారని బీజేపీ ప్రశ్నిస్తోంది.
