India - Pakistan Border: సరిహద్దులో పాక్ పౌరుల కాల్చివేత.. భారత రాయబారికి పాకిస్తాన్ సమన్లు!
India - Pakistan Border: పంజాబ్ సరిహద్దుల్లో చొరబాటుదారులను భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) మట్టుబెట్టిన ఘటన ఇండియా - పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది. సరిహద్దు కంచె దాటి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఇద్దరు పాకిస్తానీయులను సైన్యం కాల్చిచంపడంపై పాక్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇస్లామాబాద్‌లోని భారత రాయబార కార్యాలయానికి చెందిన సీనియర్ దౌత్యవేత్తకు పాక్ విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది.శుక్రవారం ముగ్గురు పాకిస్తాన్ పౌరులు పంజాబ్‌లోని తార్న్ తారన్ జిల్లా పరిధిలోని భారత్ - పాక్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద కంచెను దాటి ఇండియాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ జవాన్లు అప్రమత్తమై వారిని అడ్డుకున్నారు. తిరిగి తమ భూభాగంలోకి వెళ్లిపోవాలని పదేపదే హెచ్చరించినప్పటికీ.. వారు వినిపించుకోకుండా దూకుడుగా ముందుకొచ్చారు
