International
భారత్‌పై పశ్చిమాసియా సెగ.. భారీగా పెరిగిన చమురు బిల్లు!..
పశ్చిమాసియాలో చెలరేగిన ఘర్షణల ప్రభావం భారత్‌పై పడుతోంది. ముడి చమురు దిగుమతి పరిమాణం 18 శాతం తగ్గినా.. దిగుమతి బిల్లు మాత్రం ఏకంగా 26 శాతం పెరిగింది. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య భారత్ దాదాపు 59.7 మిలియన్ టన్నుల చమురు దిగుమతి చేసుకోగా.. ఇందుకోసం 49 బిలియన్ డాలర్లు, అంటే రూ.4.11 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసింది. హార్మూజ్ జలసంధి వద్ద సరఫరా అంతరాయాల భయాలతో అంతర్జాతీయ ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. రష్యా 40 శాతానికి పైగా సరఫరాతో భారత్‌కు అతిపెద్ద చమురు వనరుగా నిలిచింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. భారత్‌పై చమురు భారం మరింత పెరిగే అవకాశం ఉంది.
