National

National : డేంజర్ జోన్‌‌లో భారత్.. 2027 చివరివరకు ఎల్‌నినో ప్రభావం!

ప్రపంచ వ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం తీవ్రంగా పడనున్నట్టు తెలుస్తోంది. పసిఫిక్ మహాసముద్ర ఉపరితలంపై ఉష్ణోగ్రతలు క్రమంగా వేడెక్కుతుండటంతో ఎల్ నినో ఎఫెక్ట్ ఏర్పడింది. దీంతో భారతదేశంలో నైరుతి రుతుపవనాలు ఆలస్యం అవ్వడంతో పాటు తొందరగా బలహీన పడ్డాయి.ఫలితంగా ఈ ఏడాది వర్షాకాలంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చే ఏడాది వర్షాకాలం వరకు పరిస్థితులు చక్కబడేలా పరిస్థితులు కనిపించడం లేదు. ఇదే విషయాన్ని వాతావరణ శాస్త్రవేత్తలు స్పష్టంచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎల్‌నినో తాజాగా పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక హెచ్చరికలు చేసింది. 2027 సెప్టెంబర్ వరకు ప్రపంచవ్యాప్తంగా ‘ఎల్ నినో’ ప్రభావం కొనసాగే అవకాశం ఉందని స్పష్టంచేసింది. అంతేకాకుండా, 'హై రిస్క్ జోన్' (అధిక ముప్పు ఉన్న దేశాల జాబితా)లో భారత్‌ను చేర్చింది. ఎల్‌నినో పరిస్థితుల కారణంగా దేశంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో పాటు వర్షపాతంలో తీవ్ర హెచ్చుతగ్గులు చోటుచేసుకునే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరికలు చేశారు.