National

India Fuel Rates: సామాన్యుడికి ఊరట లభిస్తుందా.. దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గనున్నాయా?

ndia Fuel Rates: నిత్యం పెరుగుతున్న ఖర్చులతో సతమతమవుతున్న సామాన్యుడికి త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరల రూపంలో తీపి కబురు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు అనూహ్యంగా దిగిరావడమే ఇందుకు ప్రధాన కారణం. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్ పార్టీ ఎదురుదెబ్బ తినడం, ఫలితంగా ఇరాన్‌తో యుద్ధ వాతావరణం ముగిసి శాంతి నెలకొంటుందన్న సంకేతాలు రావడంతో గ్లోబల్ మార్కెట్లో చమురు మంటలు ఒక్కసారిగా చల్లారాయి.గత అక్టోబర్ తర్వాత తొలిసారిగా అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 100 డాలర్ల మార్క్ కంటే కిందకు పడిపోయింది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ 4.7 శాతం తగ్గి బ్యారెల్‌కు 98.76 డాలర్ల వద్ద, డబ్ల్యూటీఐ 91.73 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఇరాన్‌తో యుద్ధమే తమ పార్టీ ఓటమికి కారణమని ట్రంప్ అంగీకరించడం, ప్రస్తుతానికి తక్షణ దాడుల ప్రణాళికలు ఏవీ లేవని ప్రకటించడంతో మార్కెట్లలో ఆందోళన తగ్గింది.