అభిప్రాయం
India Development: అభివృద్ధిలో ఇండియా ఎందుకు వెనకబడుతుంది?!
ఇజ్రాయెల్‌కు నీటి కొరత.. జపాన్‌కు సహజ వనరుల కొరత.. సింగపూర్‌కు భూమి కొరత.. అయినప్పటికీ ఈ దేశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. వారికి ఉన్న పరిమిత వనరులను సమర్థంగా ఉపయోగించుకుంటూ సాంకేతికత, పరిశోధన, పారిశ్రామిక రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయి. మరి భారతదేశంలో కూడా సహజ వనరులు, అపారమైన మానవ వనరులు ఉన్న అదే స్థాయిలో ఎందుకు అభివృద్ధి చెందలేకపోతోంది? అసలు మన అభివృద్ధికి అడ్డుగా నిలుస్తున్నది ఎవరు? సమస్య ఎక్కడ ఉంది?
