International
చైనాకు మళ్లీ దగ్గరవుతున్న భారత్? జిన్‌పింగ్ రాక వెనుక అసలు లెక్కేంటి?
భారత్, చైనా రెండూ ప్రస్తుతం మారుతున్న అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొంటున్నాయి. అమెరికా వాణిజ్య విధానాలు, ప్రపంచ ఆర్థిక పరిణామాలు వంటి అంశాలు ఇరు దేశాలపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో ఒకరితో ఒకరు పోటీ పడుతూనే.. కొన్ని అంతర్జాతీయ అంశాల్లో కలిసి పనిచేయాల్సిన అవసరం కూడా ఏర్పడుతోంది.
