National
INDIA: ఎస్బీఐ ఖాతాదారులు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి మారనున్న ఏటీఎం రూల్స్!..
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాలరీ ప్యాకేజీ ఖాతాదారులకు షాకిచ్చింది.. ఎస్బీఐ డెబిట్ కార్డును ఉపయోగించి ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి చేసుకునే ఉచిత నగదు ఉపసంహరణల పరిమితిని సవరించింది. దీన్ని 10 నుంచి 5కు తగ్గించింది. ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుంచే అమల్లోకి రానున్నాయి. ఇక అదనంగా చేసే ప్రతి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌పై రూ.23 వసూలు చేయనుంది. దీనికి జీఎస్టీ అదనం. నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లపై రూ.11+ జీఎస్టీ ఛార్జీలు ఉండనున్నాయి. ఈ కొత్త నిబంధనలు కేవలం ఎస్బీఐ శాలరీ ప్యాకేజీ ఖాతాదారులకు మాత్రమే.
