మహిళను జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లిన ఘటన.. డీజీపీ సంచలన ఆదేశాలు
హైదరాబాద్ మహానగరంలో ఓ మహిళ పట్ల పోలీసు హోంగార్డు అమానుషంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆమె మీద లాఠీతో దాడి చేయడంతో పాటు మాట వినడం లేదని జుట్టుపట్టుకుని కింద పడేసి ఈడ్చుకెళ్లినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో ఆమెను విడిచిపెట్టాలని మరో వ్యక్తి ఎంత వేడుకున్నా సదరు హోంగార్డు వినిపించుకోలేదు. దీంతో స్థానిక యువకులు కొందరు ఆ దారుణ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో వదిలారు. అది కాస్త క్షణాల్లోనే వైరల్ అయ్యింది. ఈ విషయం కాస్త డీజీపీ సీవీ ఆనంద్ వద్దకు చేరడంతో ఆయన సీరియస్ అయ్యారు. సదరు హోంగార్డు రాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన వ్యక్తి అయినా డిప్యూటేషన్ మీద భారతీయ రైల్వే తరఫున పనిచేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. మహిళపై హోంగార్డు దాడి చేసిన తీరును డీజీపీ సీవీ ఆనంద్ తీవ్రంగా ఖండించారు. మహిళ పట్ల విచక్షణా రహితంగా ప్రవర్తించిన ఆయనను సర్వీస్ నుంచి తొలగించడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీచేశారు.
