తెలంగాణ
Palapitta: పాలపిట్టను పంజరంలో బంధిస్తే జైలు శిక్షే.. తెలంగాణ అటవీ శాఖ హెచ్చరికలు జారీ!
విజయదశమి (దసరా) పండుగ నేపథ్యంలో తెలంగాణ అటవీ శాఖ ప్రజలకు, ఉత్సవ నిర్వాహకులకు అత్యంత కీలకమైన హెచ్చరికలు జారీ చేసింది. పండుగ వేళ సెంటిమెంట్ పేరుతో తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన ‘పాలపిట్ట’ను పంజరాల్లో బంధించి ప్రదర్శించే అక్రమ చర్యలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడానికి సిద్ధమైంది. నిబంధనలను అతిక్రమించి పాలపిట్టలను బంధిస్తే చట్టపరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అటవీ దళాల ప్రధాన అధికారి (PCCF) వినయ్ కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణ సాంస్కృతిక ప్రతీకగా నిలిచే పాలపిట్టను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని పిసిసిఎఫ్ గుర్తుచేశారు. దసరా రోజున పాలపిట్ట దర్శనం శుభప్రదంగా భావించినప్పటికీ, వాటిని బోనుల్లో బంధించి ఇబ్బంది పెట్టడం తీవ్రమైన నేరమని పేర్కొన్నారు
