తెలంగాణ
హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం బంద్.. ట్యాంక్‌బండ్ పరిసరాల్లో హైటెన్షన్
హైదరాబాద్ మహానగరంలో గణపతి నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. వినాయకతి చవితి పండుగ సందర్భంగా ప్రతిష్టించిన విగ్రహాల నిమజ్జనం మూడో రోజు నుంచే ప్రారంభం అవ్వగా.. తాజాగా జీహెచ్ఎంసీ తీసుకున్న నిర్ణయంతో గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు, అధికారులకు మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చారిత్రక ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనాలను నిషేధిస్తూ అధికారులు ఏర్పాటు చేసిన బ్యానర్లపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తీవ్రంగా మండిపడింది. ఈ క్రమంలోనే నిరసనకు దిగిన ఉత్సవ సమితి నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ట్యాంక్ బండ్ పరిసరాలు రణరంగంలా మారాయి.
