తెలంగాణ

రాష్ట్ర క్యాబినెట్‌లో తక్షణ మార్పులు అవసరం.. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు!

తెలంగాణ రాజకీయాల్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. విలేకరులతో జరిపిన చిట్‌చాట్‌లో ఆయన రాష్ట్ర ప్రభుత్వం, అధికార కాంగ్రెస్ పార్టీ శైలిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లన్నర పూర్తయిన సందర్భంలో, క్యాబినెట్‌లో తక్షణమే మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ (షఫ్లింగ్) చేపట్టడం ద్వారా ప్రభుత్వానికి ఒక కొత్తదనం, నూతనోత్సాహం వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.