National

‘నిన్ను కలెక్టర్ చేస్తా’.. మహిళా ఉద్యోగికి ఎస్పీ నేత వేధింపులు

మహిళలను వేధిస్తున్న రాజకీయ నేతల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇలాంటివి కొన్ని ఘటనలు బయటపడుతుంటే మరికొన్ని బయటకు రావడం లేదు. పరువు కోసం మహిళలు బయటకు రావడం లేదని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మౌనంగా బరిస్తున్నారని తెలుస్తోంది. సొసైటీ నుంచి ఎదురయ్యే ప్రశ్నలు, కుటుంబం కోసం మౌనంగా ఉంటూ వేధింపులను బరిస్తున్నట్టు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళను రాజకీయ నేత వేధించిన ఘటన తాజాగా కలకలం రేపింది. సదరు నేత మహిళను వాట్సాప్‌లో వేధించడంతో పాటు అసభ్యకర సందేశాలు పంపినట్టు సమాచారం. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ప్రస్తుతం నెట్టంట వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. సమాజ్ వాదీ పార్టీ మైనారిటీ విభాగం కార్యదర్శి రాజన్ రిజ్వీ తనను వేధిస్తున్నాడని ఓ మహిళా బ్యాంక్ ఉద్యోగిని పోలీసులను ఆశ్రయించింది. దీనికితోడు తనకు పంపిన మెసేజ్‌లను మీడియా ముందు పెట్టింది.