వైరల్ న్యూస్
‘సింగరేణి పోతే ఆ మాత్రం ఉండాలి’.. కొత్త లుక్‌పై కేటీఆర్ చమత్కారం!
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) తన సరికొత్త లుక్‌తో రాజకీయ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఆసక్తిని రేకెత్తించారు. సాధారణంగా క్లీన్ షేవ్, ప్రొఫెషనల్ ఫార్మల్ ఆహార్యంలో కనిపించే ఆయన.. ఈసారి గడ్డం పెంచి సరికొత్త 'మాస్ లుక్'లో దర్శనమివ్వడం బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. రామగుండంలో నిర్వహించనున్న 'సింగరేణి కార్మిక గర్జన' సభకు బయల్దేరిన సమయంలో ఆయన ఈ కొత్త అవతారంలో కనిపించడంతో ఫొటోలు, వీడియోలు క్షణాల్లో వైరల్‌గా మారాయి.
