రాజకీయాలు

నా మీద పగ ఉంటే నన్ను చంపేయండి : ఎమ్మెల్యే మాధవరం

బీఆర్ఎస్ కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ‘నా మీద పగ ఉంటే చంపేయండి’ అంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం రాష్ట రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి,కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే తన మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు.కూకట్ పల్లి నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకటి హైదరాబాద్‌లో.. మరొకటి మల్కాజ్‌గిరిలో.. ఇంకొకటి సైదాబాద్‌లో కలిపారని ఫైర్ అయ్యారు.తన మీద కోపంతో నియోజకవర్గ ప్రజలకు అన్యాయం చేయొద్దని వ్యాఖ్యానించారు. 22 ఏ నిషేధిత జాబితా నుంచి కూకట్ పల్లి నియోజకవర్గ ప్రజల భూములు, ఆస్తులను తొలగించకపోతే నిన్ను వదిలిపెట్టను రేవంత్ రెడ్డి అంటూ వార్నింగ్ ఇచ్చారు.