తెలంగాణ

మాకు ఓటు హక్కు వస్తే రేవంత్‌ను మళ్లీ రానివ్వం : పాలిటెక్నిక్ విద్యార్థులు

సీఎం రేవంత్ సర్కారు మీద పాలిటెక్నిక్ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘శక్తి’ స్కీం తీసుకొచ్చిన సర్కారు.. అందులోనే స్కిల్డ్ కోర్సులు అన్నింటినీ అనుసంధానం చేయాలని విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్న సీఎం ఆలోచన చేసిన విషయం తెలిసిందే. దీంతో పాలిటెక్నిక్ విద్యార్థులు తమ కోర్సు పూర్తి అయ్యాక బీటెక్ చేయడం కంటే టెక్నికల్, బ్లూకాలర్ స్కిల్డ్ కోర్సులు నేర్పించి ఉద్యోగావకాశాలు చూపించాలని పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, శక్తి స్కీం ద్వారా మూడేళ్ల సాంకేతిక పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సును సాధారణ నైపుణ్య శిక్షణ లేదా ఐటీఐ స్థాయికి కుదించి, దాని ప్రత్యేక గుర్తింపును మరుగున పరిచే అవకాశం ఉందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.పాలిటెక్నిక్ తర్వాత నేరుగా ఇంజినీరింగ్ (B.Tech) రెండో సంవత్సరంలో ప్రవేశం కల్పించే 'ఈసెట్' (ECET) లాటరల్ ఎంట్రీ విధానం దెబ్బతింటుందని, దీనివల్ల నేరుగా బీటెక్ చదివే అవకాశాన్ని కోల్పోతామని విద్యార్థులు భయపడుతున్నట్టు తెలుస్తోంది.