తెలంగాణ
కాంగ్రెస్ గెలిస్తే ఈసీ తప్పులేదు.. ఓడితే తప్పా : కిషన్ రెడ్డి
ఓటు చోరీకి కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మద్దతుగా నిలుస్తున్నారని, ఎస్ఐఆర్ పేరిట ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించిన విషయం తెలిసిందే.ఆయన రాజీనామాకు కాంగ్రెస్ పార్టీ పట్టుడుతున్న నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. రాహుల్ గాంధీ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈసీ అంశంలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ గెలిస్తే ఈసీ సరిగా పని చేస్తుందని.. అదే కాంగ్రెస్ ఓటమి చెందితే ఈసీ సరిగా పనిచేయట్లేదని అంటున్నారని విమర్శించారు. రాహుల్‌ను ప్రధానమంత్రి చేసేందుకు ఈసీ పని చేయదని స్పష్టంచేశారు.
