మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేసిన పోలీసులను గుర్తించండి : హైకోర్టు
ఈనెల 7న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్దే పోలీసులు, బీఆర్ఎస్ చట్టసభ సభ్యుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. స్లోగన్స్ రాసి ఉన్న నల్లటి దుస్తులు, ప్లకార్డులు పట్టుకుని సభలోనికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో వివాదం రాజుకుంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్మేలు, ఎమ్మెల్సీలు, మహిళా శాసనసభ్యులకు మధ్య తోపులాట జరిగింది. అయితే, తమ పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారని మహిళా ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తన చీర లాగారని ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ కన్నీళ్లు పెట్టుకుంది. అలాగే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జుట్టుపట్టి పోలీసులు లాగినట్టు విజువల్స్ వైరల్ అయ్యాయి. ఈ విషయంలో రాష్ట్ర పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు అటు గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ముందుగా ఫిర్యాదు చేశారు. అనంతరం హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం ..తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేసిన పోలీసులను గుర్తించాలని రాష్ట్ర డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
