National

icici bank: ఐసీఐసీఐ కస్టమర్లకు భారీ షాక్.. డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్!

icici bank: ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్. సేవింగ్స్ అకౌంట్స్ ద్వారా జరిపే నగదు లావాదేవీల చార్జీలను సవరిస్తూ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త రూల్స్ డిసెంబర్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో బ్యాంకు బ్రాంచీలు, ఏటీఎంలలో భారీగా నగదు డిపాజిట్, విత్‌డ్రా చేసే కస్టమర్ల జేబులకు మరింత చిల్లు పడనుంది.బ్యాంక్ వెల్లడించిన తాజా మార్గదర్శకాల ప్రకారం.. బ్రాంచీలతో పాటు క్యాష్ రీసైక్లర్ మెషిన్ల ద్వారా జరిపే నగదు లావాదేవీలపై చార్జీలను పెంచారు. నెలవారీ ఉచిత పరిమితి దాటిన తర్వాత చేసే లావాదేవీల్లో ప్రతి వెయ్యి రూపాయలపై ఇప్పటివరకు ఉన్న రూ.3.50 చార్జీని రూ.4కి పెంచారు.