క్రీడలు
ICC Cricket World Cup: 2027 వన్డే ప్రపంచకప్ వేదికలు ఖరారు.. ఐసీసీ కీలక ప్రకటన
సుదీర్ఘమైన 24 ఏళ్ల విరామం తర్వాత పురుషుల వన్డే క్రికెట్ ప్రపంచకప్‌కు ఆఫ్రికా ఖండం మళ్లీ ఆతిథ్యం ఇవ్వబోతోంది. 2027లో జరగబోయే ఈ ప్రతిష్ఠాత్మక మెగా టోర్నమెంట్‌ను దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు ఉమ్మడిగా నిర్వహించనున్నాయి.
