అభిప్రాయం
మహిళల వస్త్రధారణపై ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ప్రముఖ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన వృత్తి, వ్యక్తిగత జీవిత విశేషాలను పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను స్మరించుకున్నప్పుడు తాను తీవ్ర భావోద్వేగానికి లోనయ్యానని ఆమె తెలిపారు. అమరులైన కుమారుల త్యాగాలను తలచుకుంటూ ఆ తల్లులు వ్యక్తపరిచిన ఆవేదన ఒక తల్లిగా తనను లోతుగా ప్రభావితం చేసిందని, అలాంటి సందర్భాల్లో కన్నీళ్లు ఆపుకోవడం ఎవరికైనా సాధ్యం కాదని అన్నారు. సమాజంలో మహిళల వస్త్రధారణపై ఉండే అభిప్రాయాలపై స్మితా సబర్వాల్ స్పందిస్తూ.. ఏ దుస్తులు ధరించాలనేది పూర్తిగా మహిళల వ్యక్తిగత సౌకర్యం, ఎంపికకు సంబంధించిన అంశమని స్పష్టం చేశారు.
