తెలంగాణ
కుప్పకూలిన ఐఏఎస్ నవీన్ మిట్టల్ పర్సనల్ సెక్రెటరీ.. మంత్రి సీపీఆర్ చేసినా..!
రాష్ట్రంలో ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తీవ్ర విషాదం నెలకొంది. ఐఏఎస్ నవీన్ మిట్టల్ పర్సనల్ సెక్రెటరీ రాజు ఆకస్మాత్తుగా ఉన్నట్టుండి కుప్పకూలారు.అసెంబ్లీ ఆవరణలో ఉన్నట్టుండి కింద పడిపోవడంతో మంత్రి వాకిటి శ్రీహరి ఆయనకు సీపీఆర్ చేశారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. రాజు మృతికి కార్డియాక్ అరెస్టు కారణమని తెలుస్తోంది. అసెంబ్లీ ఆవరణలో ఆయన విధుల్లో ఉండగా ఉన్నట్టుండి కుప్పకూలడంతో ఆయన్ను రక్షించడానికి మంత్రి వాకిటి శ్రీహరి తీవ్రంగా ప్రయత్నించారు. సీపీఆర్ చేసినా ఆయన ప్రాణాలతో బయటపడకపోవడంతో అధికారులు, మంత్రి సైతం నిరాశకు లోనైనట్టు తెలుస్తోంది.
