తెలంగాణ
మృతురాలు భారతి ముఖి కుటుంబాన్ని ఆదుకుంటా : కేటీఆర్
జనసేన పార్టీ రాజ్యసభ ఎంపీ లింగమేని రమేష్ కొడుకు సంజూష్ చేసిన కారు యాక్సిడెంట్లో మృతి చెందిన భారతి ముఖి కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఘటన జరిగి 20 రోజులకు పైనే అవుతున్నా మృతురాలి కుటుంబానికి న్యాయం దొరకలేదు. కనీసం ఆర్థిక సహాయం కూడా అందకపోవడంతో కేటీఆర్ సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఏకైక జీవనాధారం కోల్పోయిన భారతి కుటుంబానికి వీలైనంత త్వరగా ఆర్థిక సహాయం అందిస్తామని కేటీఆర్ ప్రకటించారు. నేరస్థుడు శిక్ష లేకుండా స్వేచ్ఛగా బయట తిరుగుతుంటే మృతురాలి కుటుంబం జీవనాధారం కోల్పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కన్నా ఎన్డీఏ నాయకుల బంధువులను కాపాడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్ర విమర్శలు చేశారు.
