రాజకీయాలు
ఏది పడితే అది వాగితే ఊరుకోను.. ఎవరినీ వదిలిపెట్టను : హరీశ్ రావు
రాష్ట్రంలో వర్షాలు కురవకుండా, అధికారపార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేందుకు తాను క్షుద్రపూజలు చేస్తున్నానని కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలపై శాసనసభ బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టెక్నాలజీ యుగంలో రాష్ట్రంలో వర్షాలు పడొద్దని, తాను క్షుద్రపూజలు చేశానని కాంగ్రెస్ నేతలు తనపై నిందలు వేయడం సిగ్గుచేటన్నారు.
