తెలంగాణ
చిన్నారెడ్డిని సస్పెండ్ చేయకపోతే గాంధీభవన్ ముట్టడిస్తా: మేఘారెడ్డి
కాంగ్రెస్ పార్టీలో రోజుకో వివాదం ముదురుతోంది. పదవులు వచ్చిన వాళ్లు ఇతర పనుల్లో బిజీగా ఉంటే రాని వారు మాత్రం పార్టీని, అధిష్టానం పెద్దలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.ఈ క్రమంలోనే వనపర్తి జిల్లాలో ప్రణాళికసంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే మేఘా రెడ్డి మధ్య కొత్తగా మాటల యుద్ధం నెలకొంది.డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ కొనుక్కున్నాడని చిన్నారెడ్డి చేసినవ్యాఖ్యలపై ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి డెడ్‌లైన్ పెట్టినట్టు తెలుస్తోంది. చిన్నారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి లేదంటే గాంధీ భవన్‌ను ముట్టడిస్తా అని హెచ్చరించినట్టు తెలిసింది. దీంతో వనపర్తిలో కాంగ్రెస్ నాయకుల మధ్య అంతర్గత పోరు రచ్చకెక్కుతున్నదని ప్రచారం జరుగుతోంది.
