క్రైమ్

చిన్ననాటి ఫ్రెండ్ అని నమ్మితే నట్టేట ముంచాడు.. చివరకు!

చిన్న నాటి స్నేహితుడు కదా అని నమ్మితే సదరు వ్యక్తి ఓ వివాహితను నట్టేట ముంచాడు.అంతటితో ఆగకుండా ఆమె మీద పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి బ్లాక్ మెయిల్‌కు దిగాడు.చివరకు బాధితురాలు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించడంతో ఆ మోసగాడి బాగోతం బట్టబయలు అయ్యింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతికి కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిగింది. కొంతకాలం తర్వాత తన 10వ తరగతి ఫ్రెండ్ ఉదయ్‌తో తరచూ ఫోన్లో మాట్లాడటం మొదలెట్టిన యువతి క్రమంగా అతనికి దగ్గరైనట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఉదయ్ ఆమెపై లైంగికదాడికి పాల్పడటంతో పాటు వీడియోలు చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేసినట్టు తెలిసింది.