క్రైమ్
న్యాయం జరగలేదనే హరిబాబును చంపాను.. వైష్ణవి అన్న సంతోష్ వీడియో!
నిజామాబాద్ నగరంలో నడిరోడ్డుపై సంచలనం సృష్టించిన యూట్యూబర్ వైష్ణవి భర్త, ఆమె హత్య కేసు ప్రధాన నిందితుడైన చిత్తరి హరిబాబు(26) హత్య కేసులో ఊహించని మలుపు తిరిగింది. హరిబాబును తానే నరికి చంపానని, తన చెల్లెలి హత్యకు ప్రతీకారంగానే ఈ ఘాతుకానికి ఒడిగట్టానని వైష్ణవి సోదరుడు సంతోష్ ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేయడం స్థానికంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. గురువారం మధ్యాహ్నం పట్టపగలు నడిరోడ్డుపై నిందితులు హరిబాబుపై దాడి చేసి కిరాతకంగా నరికి చంపిన కొద్ది గంటల్లోనే సంతోష్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పోలీసులకు లొంగిపోతున్నట్లు ప్రకటించాడు.
