తెలంగాణ

ఖైరతాబాద్ టికెట్ అడిగే రైట్ నాకు ఉంది : చింతల రామచంద్రా రెడ్డి

ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారి మరో కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసినప్పుడే ఆయన శాసనసభ సభ్యత్వం రద్దు కావాల్సిందని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత చింతల రామచంద్రారెడ్డి అన్నారు. దానం శాసనసభ సభ్యత్వం రద్దు కోసం బీజేపీ ఎంతగానో న్యాయపోరాటం చేసిందన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లి ఫైట్ చేశామని, ఎట్టకేలకు తమ కృషి ఫలించిందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ 8 ఎంపీ స్థానాలు , 8 ఎమ్మెల్యేలు, గ్యాట్యుయేట్ ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ సైతం గెలిచిన విషయాన్ని గుర్తుచేశారు. ఈసారి ఖైరతాబాద్ నియోజకవర్గంలో తాము తప్పకుండా గెలుస్తామని వెల్లడించారు.అయితే, ఖైరతాబాద్ నుంచి ఎవరు పోటీ చేస్తారనేదానిపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.అయితే, ఖైరతాబాద్ నుంచి పోటీ చేయడానికి, టికెట్ అడిగే హక్కు తనకు ఉందన్నారు. మిగితా వాళ్లు కూడా టికెట్ అడగవచ్చని చెప్పారు. తాను ఖైరతాబాద్ వదిలి ఇప్పటి వరకు ఎక్కడకు పోలేదని గుర్తుచేశారు. టికెట్ ఇస్తే కచ్చితంగా బరిలోదిగి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.