తెలంగాణ

TG: ఇళ్లలో అక్రమ బోర్లు.. సున్నం చెరువులో హైడ్రా స్టింగ్ ఆపరేషన్!

TG: హైదరాబాద్ నగరంలో దశాబ్దాలుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న భారీ నీటి దందాపై హైడ్రా పక్కా ప్లాన్‌తో దాడి చేసింది. సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లోని ఇళ్లనే అడ్డాగా చేసుకుని అక్రమంగా నీటిని తోడేస్తున్నారన్న సమాచారంతో అధికారులు చేపట్టిన స్టింగ్ ఆపరేషన్ ఇప్పుడు నగరవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఎవరూ కనిపెట్టకుండా ఉండేందుకు ఏకంగా పడుకునే బెడ్‌రూమ్‌లు, వంటగదులు, నీళ్ల సంపుల్లోనే భారీ బోర్లు వేసి కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్న కేటుగాళ్ల గుట్టును అధికారులు మీడియా సమక్షంలోనే రట్టు చేశారు.జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, జలమండలి సిబ్బందిని కలుపుకుని హైడ్రా టీమ్ శనివారం తెల్లవారుజామున 6:30 గంటలకే సున్నం చెరువు చెంత రంగంలోకి దిగింది. ఇళ్ల లోపల భారీ మోటార్లతో బోర్లు వేసి, అక్కడి నుంచి వందల మీటర్ల మేర భూమి అడుగున పైపులు పరిచి నీటిని మరో ప్రాంతానికి గుంజేస్తున్నారు.