తెలంగాణ
HYDRAA: ‘హైడ్రా’ కమిషనర్‌కు హైకోర్టు బిగ్‌షాక్.. ఆర్మీ స్థలాల్లో జోక్యంపై సంచలన ఆదేశాలు!
తెలంగాణలో చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణల తొలగింపే లక్ష్యంగా రంగంలోకి దిగిన 'హైడ్రా' (HYDRAA) కు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సికింద్రాబాద్ లోతుకుంటలోని ఆర్మీ భూముల వ్యవహారంలో జోక్యం చేసుకోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి ఆర్మీ భూముల్లోకి ప్రవేశిస్తే హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో పాటు ఇతర అధికారులను అరెస్ట్ చేసి, వారి చేతులకు సంకెళ్లు వేసి తమ ఆధీనంలోకి తీసుకోవాలని ఆర్మీ అధికారులకు హైకోర్టు స్పష్టమైన సూచనలు చేసింది.
