తెలంగాణ

కోర్టు ఆదేశాలనూ లెక్కచేయని హైడ్రా.. రామంతపూర్‌లో ఇల్లు కూల్చివేత!

 హైదరాబాద్ నగరంలో హైడ్రా (HYDRAA) తన కూల్చివేతల పరంపరను కొనసాగిస్తోంది. తాజాగా శనివారం నగరంలోని రామాంతాపూర్ ప్రాంతంలో హైడ్రా అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టారు. స్థానిక చెరువు పూర్తి స్థాయి నీటి మట్టం (FTL) పరిధిలో అక్రమంగా నిర్మించారనే ఆరోపణలతో ఓ ఇంటిని అధికారులు నేలమట్టం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కూల్చివేతకు గురైన ఇంటి యజమాని మీడియా ముందు తన ఆవేదనను వెల్లబోసుకున్నాడు. కోర్టు ఇచ్చిన 'స్టేటస్ కో' (Status Quo) ఆదేశాలను సైతం అధికారులు లెక్కచేయకుండా ఈ కూల్చివేతలకు పాల్పడ్డారని బాధితుడు వాపోయాడు.