తెలంగాణ

నగరాల్లో వరదలకు ప్రధాన కారణం అదే

Hydraa: దేశంలోని ప్రధాన నగరాలు ఇప్పుడు తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్నాయి. ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాలను వరద ముప్పు భయపెడుతోంది. చిన్న పాటి వర్షం కురిసినా ఈ నగరాలు చిగురుటాకులా వణికిపోయే పరిస్థితి ఉంది. అర్బన్ ఫ్లడ్స్ ఇప్పుడు నగరవాసులను తీవ్రంగా భయపెడుతున్న అంశం. కాగా, నగరాల్లో నెలకొన్న ఈ దుస్థితిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

సిటీస్ లో వరదలకు ప్రధాన కారణం చెరువులు లాంటి సహజ జల వనరులు కనుమరుగు కావడమే అని రంగనాథ్ తెలిపారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన అర్బన్ ఎన్విరాన్ మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ జాతీయ సదస్సులో రంగనాథ్ చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు.