తెలంగాణ
TG: హైడ్రా రంగనాథ్ మార్క్ డీల్.. వాటర్ ట్యాంకర్ల సమ్మె క్లోజ్!
TG: గ్రేటర్ హైదరాబాద్ వాసులను రెండు రోజులుగా ముచ్చెమటలు పట్టించిన వాటర్ ట్యాంకర్ల సమ్మెకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తనదైన మార్క్ వ్యూహంతో ఫుల్స్టాప్ పెట్టారు. బెట్టు వీడని ట్యాంకర్ల యజమానులతో నేరుగా చర్చలు జరిపి, అటు ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ఇటు వాణిజ్య అవసరాలకు అంతరాయం లేకుండా ఆయన చూపించిన ప్రత్యామ్నాయ పరిష్కారం బాగా పనిచేసింది. కమిషనర్ ప్రతిపాదించిన మార్గానికి యజమానులు ఒప్పుకోవడంతో సమ్మె తక్షణమే ముగిసింది. నగరవ్యాప్తంగా నీటి సరఫరా పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్ పడింది.హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచనలతో వాటర్ ట్యాంకర్ల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ నేతృత్వంలోని బృందం బుధవారం హైడ్రా కార్యాలయానికి చేరుకుంది. ఈ భేటీలో కమిషనర్ రంగనాథ్ అసలు వాస్తవాలను టేబుల్‌పై పెట్టి లెక్కలతో సహా నిలదీశారు.
