ప్రపంచం
నేపాల్ వరదల్లో హైదరాబాద్ మహిళ మిస్సింగ్..
నేపాల్‌లో సంభవించిన వరదల కారణంగా మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉన్నది. ప్రస్తుతం వరదలు తగ్గుముఖం పట్టడంతో గుట్టలుగా పేరుకుపోయిన మృతదేహాలు దర్శనమిస్తున్నాయి. ఎక్కడైతే వరద తాకిడి ఎక్కువగా ఉందో ఆయా ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, నేపాల్ వరదల్లో హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ గల్లంతు అయినట్టు తెలుస్తోంది.కైలాస మానస సరోవర యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణంలో విషాదం జరిగినట్టు సమాచారం. గల్లంతైన మహిళను శ్రీదేవి వేజెళ్లగా గుర్తించారు. శ్రీదేవి కనిపించకుండా పోయిందని ఆమె భర్త దీపక్ వెల్లడించారు. వరదలు వచ్చిన సమయంలో శ్రీదేవి ఇమ్మిగ్రేషన్ భవనంలో ఉన్నదని పేర్కొన్నారు.
