తెలంగాణ
TG: హైదరాబాద్‌కు నీటి గండం.. రోజుకు 10 వేల ట్యాంకర్లు బుక్ అవుతున్నా తీరని దాహం!
గ్రేటర్ హైదరాబాద్‌ను మునుపెన్నడూ లేని విధంగా నీటి సంక్షోభం వెంటాడుతోంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేయడం, ఎండల తీవ్రతతో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోవడంతో నగరవాసులు గుక్కెడు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఐటీ కారిడార్‌తో పాటు నగరంలోని దాదాపు 25 కీలక ప్రాంతాల్లో బోర్లు పూర్తిగా ఎండిపోవడంతో ప్రజలు జలమండలి వాటర్ ట్యాంకర్ల మీదే ఆధారపడాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం నగరంలో రోజుకు 10 వేల నుంచి 12 వేల ట్యాంకర్లు బుక్ అవుతున్నాయని వాటర్ బోర్డు అధికారులు చెబుతుండటం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.
