తెలంగాణ
ఫీజు బకాయి-బీజేపీ లడాయిలో అపశృతి!..
రాష్ట్రంలో విద్యార్థుల ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరాహార దీక్షలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఫీజు బకాయి-బీజేపీ లడాయి పేరుతో నిరాహార దీక్ష చేపట్టింది. ఈ పోరాటంలో భాగంగా పార్టీ శ్రేణులతో కలిసి రాంచందర్ రావు దీక్షలో కూర్చున్న క్రమంలో ఆయన రక్తపోటు 90/60కి పడిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నందున విశ్రాంతి తీసుకోవాలని, దీక్షను విరమించాలని వైద్య బృందం ఆయనకు సూచించింది.
