క్రైమ్
Hyderabad: చింతల్‌లో విషాదం.. చిన్నారిని బలి తీసుకున్న నిర్లక్ష్యం!!
హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి చింతల్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బంగారం మెరుగుపెట్టే కెమికల్ నోట్లో పెట్టుకుని రెండేళ్ల బాలిక మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. కుతుబుల్లాపూర్ నియోజకవర్గం చింతల్‌లోని విష్ణు జువెలరీస్‌కు రెండు రోజుల క్రితం గోపికృష్ణ, జానకి దంపతులు బంగారం కొనుగోలు చేయడానికి వెళ్లారు. వారితో పాటు తమ రెండేళ్ల కూతురు మిషాను కూడా వెంట తీసుకెళ్లారు. తల్లిదండ్రులు షాప్‌లో బంగారు ఆభరణాలను పరిశీలిస్తుండగా.. అక్కడే ఉన్న బంగారం చెక్ చేసే కెమికల్‌ను ఆ చిన్నారి నోట్లో పెట్టుకుంది. వెంటనే గమనించిన ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ పాప మృతి చెందడం ఆ కుటుంబానికి తీరని శోకంగా మారింది.
