తెలంగాణ
షాకిస్తున్న తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఆస్తుల చిట్టా!..
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న దేశాని శ్రీనివాస్ రెడ్డి నివాసాల మీద ఏకకాలంలో 15 చోట్ల నిర్వహించిన దాడులలో ఏకంగా వంద కోట్ల విలువైన ఆస్తులు బహిర్గతం అయ్యాయి. అధికారిక రికార్డుల ప్రకారం ఈ దాడుల్లో పట్టుబడిన ఆస్తుల విలువ రూ.6.87 కోట్లుగా కనిపిస్తున్నా బహిరంగ మార్కెట్లో రూ.100 కోట్ల పైన ఉంటుందని చెబుతున్నారు.
