తెలంగాణ

Hyderabad: హరీశ్ రావు ఆరోపణలను ఖండించిన టీజీఎస్ ఆర్టీసీ.. నాణ్యమైన సేవలే లక్ష్యమని వెల్లడి!..

మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సోషల్ మీడియా వేదికగా టీజీఎస్ ఆర్టీసీ నిర్వహణపై చేసిన ఆరోపణలకు ఆ సంస్థ యాజమాన్యం స్పష్టతనిచ్చింది. దసరా పండుగల సమయంలో బస్సు టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక బస్సుల రద్దుకు సంబంధించి హరీశ్ రావు చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొంది..

ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా పండుగ సమయాల్లో టికెట్ ధరల నియంత్రణ, ఇతర నిర్ణయాలు అన్నీ 2003వ సంవత్సరానికి చెందిన జీవో (GO) ఆధారంగానే అమలవుతున్నాయని అధికారులు వివరించారు. ప్రయాణికులపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం మోపకుండా, పూర్తిగా నిబంధనలకు లోబడే నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.