తెలంగాణ

రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా.. కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ కేబినెట్ !..

తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రేపు రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లో 18,766 పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు రూ.200 కోట్లతో ప్రత్యేక పథకానికి ఆమోదం తెలిపింది. ఒక్కో ఆటోకు రూ.1.5 లక్షల వరకు సబ్సిడీ ఇవ్వనున్నారు. డిసెంబర్‌లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 నిర్వహించనున్నారు. ఏడు రకాల సన్నాలకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలని నిర్ణయించారు. ఐటీఐలు, పాలిటెక్నిక్‌లను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురానున్నారు. అలాగే కొడంగల్ ఎత్తిపోతల ఫేజ్-2కు రూ.2,100 కోట్లు, మరో ఏడు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది.